కరీంనగర్తెలంగాణ

ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి

ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి.

కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి.

కరీంనగర్,శోధన న్యూస్: కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలు నందు కమిషనరేటులోని అన్ని విభాగాల అధికారులు పోలీస్ స్టేషన్ ల ఎస్ హెచ్ ఓ లతో కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపిఎస్ నేరసమీక్ష సమావేశంతో పాటుగా, రానున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ.. అధికారులందరికీ పలు కీలక సూచనలు చేసారు.సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు.చెక్ పోస్టులు పనితీరుపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు క్షుణ్ణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే సంఘ విద్రోహ వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే బైండ్ ఓవర్ కాబడి గడువు ముగిసిన వారిని తిరిగి బైండ్ ఓవర్ చేయాలన్నారు. ఫ్లాగ్ మార్చ్ సమయాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే జరిగే పరిణామాలను వివరించే సమావేశాల్లో ఆయా ప్రాంతాల్లో వుండే ట్రబుల్ మొంగెర్స్ ని ఉండేలా చూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలన్నిటిని సంబంధిత స్టేషన్ల అధికారులు స్వయంగా పరిశీలించాలన్నారు.ఏదైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలన్నారు.సీసీసీ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి క్వాలిటీ డిస్పోస్ చేయాలన్నారు.
కమీషనరేట్ కంప్లైంట్ సెల్ ద్వారా పోలీస్ స్టేషన్ లకు పంపించే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని, పరిష్కారం అయ్యే సమస్యల పట్ల నాణ్యమైన విచారణ జరిపి కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.కమీషనరేట్ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల వారీగా పెండింగ్ లో వున్న కేసుల వివరాలు , అందుకు గల కారణాలను తెలుసుకున్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వారెంట్లను ముఖ్యంగా భౌతిక నేరాలకు సంబందించిన వాటిని అమలయ్యేలా చూడాలన్నారు.ఎన్నికల నియమావళి అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని , అధికారులందరికీ అవగాహనా కల్పించారు. ఎటువంటి ఉల్లంఘనైనాసరే సంబంధిత సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *