తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పంచాయతీ పాలకవర్గ సభ్యులను సర్పంచ్ అవమానం పతనానికే నిదర్శనం

పంచాయతీ పాలకవర్గ సభ్యులను సర్పంచ్ అవమానం పతనానికే నిదర్శనం

అశ్వాపురం,శోధన న్యూస్: మల్లెలమడుగు పంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ పాలకవర్గ సభ్యులందరినీ సద్దుల బతుకమ్మ సందర్భంగా ఫ్లెక్సీలో ఫోటోలు వేయించి మానాది సంతోష అనే నన్ను ఫ్లెక్సీలో ఫోటో లేకుండా అవమానపరిచినంత మాత్రాన తనకి నష్టం లేదని తెలిపారు . వారి రాజకీయ వికృత శ్రేష్టలను ప్రజలు గమనిస్తూ ఉన్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తే తగిన గుణపాఠం చెప్పటానికి ప్రజలంతా ఏనాడో కంకణ బద్ధులై ఉన్నారన్నారు.   ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కనీస   వార్డు సభ్యురాలై  తనను  అవహేళన చేసినంత మాత్రాన తనకి ఒరిగేది ఏమీ లేదని అన్నారు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్ గా ఎన్నికై బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన కొన్ని నెలలకే ఎంపీ ఎలక్షన్లో ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై ఓటమి పొందిన నాడే నీ సత్తా ఏంటో ఆ రోజే ప్రజలు గమనించారన్నారు.  కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటో!సొంత పార్టీని మోసం చేసి వలస పోయిన విషయాన్ని మర్చిపోయి.. రానున్న సంస్థ గత ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తులు పోటీలో ఉంటే డిపాజిట్ రాకుండా ఓడించటానికి సిద్ధంగా ఉన్న విషయం ఆదమరచి పంచాయతీ ప్రజలను పలు సంక్షేమ పథకాల పేరుతో మోసం చేసి ఆడిన నాటకాలను నమ్మి మోసపోయే పరిస్థితి లేదని పేర్కొన్నారు. మీ  రాజకీయ భవిష్యత్తు డిసెంబర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మల్లెలమడుగు పంచాయతీలో నీ మెజార్టీ ఏంటో నిరూ నిరూపించుకోమని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *