కెసిఆర్ బీమా తో ఇంటింటికి ధీమా- ప్రభుత్వ విప్ రేగా
కెసిఆర్ బీమా తో ఇంటింటికి ధీమా
-బిఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలలో వణుకు
-సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష
– ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఆళ్లపల్లి, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోతో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసాని ఆయన అన్నారు. రాష్ట్రంలో పదేళ్ల కాలంలోనే చేసి చూపించిన నేత సీఎం కేసీఆర్ అన్నారు.దేశంలో ఇంటింటికి మంచినీళ్లు ఉచిత విద్యుత్ కళ్యాణ లక్ష్మి రైతుబంధు ఇస్తూ నైకేక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు రైతులకు 35వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైకే రాష్ట్రం తెలంగాణ అన్నారు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంతో పాటు అదనంగా మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన వారందరికీ అందజేస్తున్నామన్నారు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేసే అన్నపూర్ణ పథకం ఆసరా పెన్షన్ 5016 దివ్యాంగులకు 6000 పెన్షన్ పెంపు రైతుబంధు 16 వేలకు అగ్రవర్ణ పేదలకు గురుకులాలు కేసీఆర్ ఆరోగ్య రక్షణకు 15 లక్షలు గ్యాస్ సిలిండర్ 400 మహిళ సమైక్యలకు సొంత భవనాలు గృహలక్ష్మి హామీలను ఇంటింట ప్రచారం చేసి వివరిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్ గారి పై ప్రజలకు ఉన్న భరోసా కు నిదర్శనం అన్నారు.