ఇల్లందు సభాస్థలి ఏర్పాట్లను ఎంపీ వద్దిరాజు పర్యవేక్షణ
ఇల్లందు సభాస్థలి ఏర్పాట్లను ఎంపీ వద్దిరాజు పర్యవేక్షణ
ఇల్లందు, శోధన న్యూస్:రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇల్లందులో వచ్చే నెల ఒకటవ తేదీన జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరుగనున్న ఈ సభలో బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఇల్లందు పట్టణ శివార్లలోని కొత్తగూడెం రోడ్డులో బొజ్జయ్య గూడెం వద్ద నిర్వహించనున్న సభ, హెలిప్యాడ్ ఏర్పాటు కోసం కొనసాగుతున్న పనులను ఎంపీ రవిచంద్ర స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు పనులలో నిమగ్నమైన వారికి పలు సూచనలు చేశారు.