కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా కూర్చోబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుదాం
కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా కూర్చోబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుదాం
-రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా కూర్చోబెట్టడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుదామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఎంపీ రవిచంద్ర కొత్తగూడెంలో సోమవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. సుమారు 2గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్యే వనమాతో కలిసి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. ప్రజా ఆశీర్వాద సభను దిగ్విజయం చేయడం, వనామా వెంకటేశ్వరరావును గెలిపించడం, కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి సీఎంగా కూర్చోబెట్టేందుకు మనమందరం చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేద్దామన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని, బీఆర్ఎస్ కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, ప్రాధాన్యత ఉంటుందన్నారు.మనమందరం మరింత కృషి చేసి రాజకీయాలలో 50ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రయాణం చేసిన వనమాను భారీ ఓట్ల మెజారిటీతో మరోసారి గెలిపిద్దామని ఎంపీ రవిచంద్ర తెలిపారు. పార్టీ కార్యకర్తలందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని,అండగా నిలుస్తానని ఎంపీ వద్దిరాజు భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేశానన్నారు. వచ్చే ఎన్నికలలో తనను మరోమారు ఆశీర్వదించి గెలిపించాలని ayana ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, పినపాక నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని), కొత్తగూడెం మునిసిపల్ వైస్ ఛైర్మన్ వీ.దామోదర్, బీఆర్ఎస్ ప్రముఖులు కాసుల వెంకట్,మండే హన్మంతరావు, జేవీఎస్ చౌదరి,భీమా శ్రీధర్,భూక్యా రాంబాబు, కొత్వాల్ శ్రీనివాస్, బత్తుల వీరయ్య,లక్కినేని సత్యనారాయణ, రాజుగౌడ్,పూసల విశ్వనాథం,శ్రీరాంమూర్తి,తొట్టి వెంకటేశ్వర్లు,కంభంపాటి దుర్గాప్రసాద్, బరపాటి వాసుదేవరావు, రజాక్,అనుదీప్,కాంపెల్లి కనకేష్ పటేల్,కొసున శ్రీనివాస్,ఉమర్ తదితరులు పాల్గొన్నారు.