ఆర్టీసి కార్మికులపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి
ఆర్టీసి కార్మికులపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి
-టిఎంయు డిపో కార్యదర్శి కృష్ణ
మణుగూరు, శోధన న్యూస్: ఆర్టీసి కార్మికులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని టిఎంయు మణుగూరు డిపో కార్యదర్శి ఎ కృష్ణ సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న ఏపిఎస్ఆర్టీసి చెందిన డ్రైవర్ బిఆర్ సింగ్ పై 14మంది దుండగలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారని, ఆ ఘటనను మరువక ముందే ఖమ్మంలో భద్రాచలం డిపోకు చెందిన డ్రైవర్ నాగేశ్వరరావుపై పలువురు దాడికి పాల్పడి టిప్ మిషన్ పగులగొట్టడమే కాకుండా బయటికి విసిరేశారని తెలిపారు. ఆర్టీసి కార్మికులపై జరిగిన దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. ఆయా సంఘటనలపై ఆర్టీసి సంస్థ స్పందించి దాడులకు పాల్పడిన దుండగులపై కేసులు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.