బిటిపిఎస్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
బిటిపిఎస్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
మణుగూరు, శోధన న్యూస్: స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోమ్ మంత్రి బర్డోలీ వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాట్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి ప్లాంట్ సిఈ బిచ్చన్న పూలమాల వేేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా సిఈ బిచ్చన్న మాట్లాడూతూ స్వాతంత్ర అనంతరం దేశంలో ఏర్పడ్డ అనిశ్చితిని, అనైక్యతను తన చతురతతో వల్లబాయ్ పటేల్ పరిష్కరించారని అన్నారు. ఆయన మార్గంలోనే జెన్కో కార్మికులందరు కుల మతాలకు , ప్రాంతాలకు అతీతంగా కుటుంబ సభ్యులుగా పని చేసి సంస్థ ను ముందంజలో ఉంచాలని అన్నారు. ఈకార్యక్రమంలో డీవైసీసీ,ఎస్ఈలు, డీఈలు , ఇంజనీర్లు, ఇంజనీర్ల సంఘాలు,కార్మిక సంఘాలు, అకౌంట్స్ సెక్షన్ ప్లాంట్ కార్మికులు పాల్గొన్నారు.