ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకుల హత్య రాజకీయాలు -ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకుల హత్య రాజకీయాలు
-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
-బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పై కాంగ్రెస్ నాయకుల దాడికి ఖండన
మణుగూరు, శోధన న్యూస్: ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకుlu హత్య రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ జిల్లా అద్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండలం లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నాన్ని చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజా క్షేత్రంలో ఇటువంటి దాడులు సరి కాదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య విధంగా ఆయనను ఎదుర్కొనే సత్తా లేక ఈ విధమైన దాడులకు పాల్పడడం దారుణం అన్నారు. దాడిని ప్రజాస్వామ్య వాదులంతా పార్టీలకతీతంగా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. శాంతియుతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నా ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం చేయడం బాధాకరమన్నారు. ప్రజలు చేతుల్లో గెలవడం చేతకాక కాంగ్రెస్ నాయకులు దొడ్డి దారుణ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దాడులను అందరు తిప్పి కొట్టాలన్నారు. కాంగ్రెస్ సకాలంలో తెలంగాణ ఇచ్చుంటే చాలా మంది ప్రాణాలు పోకుండా ఉండే వన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగింద న్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సమావేశంలో మణుగూరు జెడ్పిటిసి పోశం నరసింహారావు, బిఆర్ఎస్ నాయుకులు ముత్యం బాబు, బోలిశెట్టి నవీన్, ఆవుల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.