అమెరికాలో ఖమ్మం విద్యార్థి పై దాడి
అమెరికాలో ఖమ్మం విద్యార్థి పై దాడి
ఖమ్మం, శోధన న్యూస్:అమెరికాలో ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకునిపై కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా రామ్మూర్తి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బంజర గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అతని కుమారుడు పుచ్చ వరుణ్ రాజ్ ను గత ఏడాది ఆగస్టు నెలలో అమెరికా దేశంలోని ఇండియానాలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ విద్య కోసం పంపించారు. వరుణ్ రాజ్ జిమ్ కు వెళ్లి తిరిగి తన నివాసం వద్దకు వెళుతుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి అతనిపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ దాడిలో వరుణ్ రాజ్ తలభాగంలో కుడి వైపున బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వరుణ్ రాజ్ కోమాలో ఉన్నాడని, తీవ్ర గాయం కావడంతో అక్కడి వైద్యులు సర్జరీ చేయగా చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదువు కోసం అమెరికాకు వెళ్ళిన తమ కుమారుడికి ఇలా జరగడం పట్ల యువకుడి తండ్రి రోధిస్తున్నాడు.