తెలంగాణ రాష్ట్రానికి ధీమా సీఎం కేసీఆర్- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
తెలంగాణ రాష్ట్రానికి ధీమా సీఎం కేసీఆర్
-దేశానికి ఆదర్శం తెలంగాణ పథకాలు
-అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న బిఆర్ఎస్ మ్యానిఫెస్టో
– ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్రానికి సీఎం కెసిఆర్ ధీమా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అనారు. మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధి వివేకానంద నగర్ ఏరియాలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ చెందిన సుమారు 40 కుటుంబాల వారు బుధవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి అయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గడపగడపకు బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ఆయన అన్నారు. బిఆర్ఎస్ ప్రజల సంక్షేమ ప్రభుత్వం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ ద్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కొత్త ఎత్తుగడలు వేస్తుందని, అన్ని అసత్య ఆరోపణలే చేస్తుందని అన్నారు. ఆరు గ్యారంటీలు అంటూ చేస్తున్న అబద్దపు హామీలను నమ్మితే మోసపోతామని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు . ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు యూసఫ్ షరీఫ్, బాబ్ జాని, నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.