గంజాయి పట్టివేత
గంజాయి పట్టివేత
భద్రాచలం, శోధన న్యూస్: భద్రాచలం కూనవరం రోడ్ నందు 12 కేజీల గంజాయి పట్టుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. భద్రాచలం పట్టణ సీఐ నాగరాజు రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల విధుల్లో భాగంగా భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల విధులలో భాగంగా కూనవరం చెక్ పోస్ట్ వద్ద ఎస్సై విజయ లక్ష్మి, పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఖమ్మం కు చెందిన షేక్ నన్నే సాహెబ్, అవుల వర్ధన్, గొడ్డ గోపి లను తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభ్యమవ్వగా …వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నామని సిఐ తెలిపారు. 12 కేజీల గంజాయి ని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోనీ పోల్లుర్ పరిసర ప్రాంతాలలో శ్రీరామ్ అనే వ్యక్తీ వద్ద కొనుగోలు చేసి ఖమ్మం లో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మేందుకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన ముగ్గురు నిందితుల వద్ద నుండి 12 కేజీల గంజాయి, ఒక మోటార్ సైకిల్, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.3.55 లక్షలు ఉంటుందని తెలిపారు. సంఘటన పై కేసు నమోదు చేసి ముగ్గురిని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సీఐ నాగరాజు తెలిపారు.