తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

  పినపాకలో కాంగ్రెస్ విజయం ఖాయం

  • ఐక్యమత్యంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం
  • మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

కరకగూడెం, శోధన న్యూస్: వచ్చే  ఎన్న్నికల్లో పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం అని మాజీ ఎమ్మల్యే,  కాగ్రెస్ పార్టీ పినపాక అసెంబ్లీ అభ్యర్ధి పాయం వెంకటేశ్వర్లు అన్నారు. కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్అ  ధ్యక్షతన మండల స్థాయి జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..పినపాక లో ఒక్క ఓటు కూడా బిఆర్ఎస్ పార్టీకి రాదని గతంలో లాగానే మళ్లీ వచ్చే ఎన్నికల్లో పినపాక నియోజకవర్గ గడ్డమీద ఎగిరే జెండా కాంగ్రెస్ పార్టీ జెండా నేనని తెలిపారు. కాంగ్రెస్ కు ప్రజల నుంఛి వస్తున్న ఆధరణతో బిఆర్ఎస్ నాయకుల గుండెల్లో గుబులు పుడుతోందని,  అక్రమంగా సంపాదించిన డబ్బుతో నాయకుల్ని కొనుకుంటున్నారని,బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసపూరిత హామీలతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని  విమర్శించారు. నేడు దేశం అభివృద్ధి పతంలో పయనిస్తుందంటే కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంస్కరణలే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ కుటుంబ పాలనతో అప్పుల పాలయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాం, లీక్ ల స్కామ్ తో రాష్ట్ర ప్రతిష్టను భ్రష్టు పట్టించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్నిదే అని ఏద్దేవ చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ అని  గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించారని అన్నారు. పినపాక నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.  కాంగ్రెస్ పార్టీతోని పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు,రైతులకు, యువతకు మంచి భవిష్యత్తు ఉందని, ఇచ్చిన ప్రతి ఒక్క మాట నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.  ఈ సమావేశంలో పినపాక నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకులు గాదె కేశవ రెడ్డి, సమత్ భట్టుపల్లి సర్పంచ్ నియోజకవర్గ నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి, నియోజకవర్గ యూత్ జనరల్ సెక్రటరీ మిట్టపల్లి నితిన్, కరకగూడెం మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్,మండల నాయకులు ఎర్ర సురేష్,జలగం కృష్ణ, ఉప సర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శులు చంద నాగేశ్వరరావు, షేక్ రఫీ,మాజీ ఎంపీటీసీ బిజ్జ రామనాథం,మాజీ సర్పంచ్లు పోలేబోయిన తిరుపతయ్య, వట్టం సమ్మక్క,సీనియర్ నాయకులు, కార్యకర్తలు,మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *