విద్యార్ధులకు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు
విద్యార్ధులకు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు
వైరా, శోధన న్యూస్: వైరా లోని ఠాగూర్ విద్యాసంస్థలైన డిగ్రీ కళాశాల, క్రాంతి జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ అధ్యక్షతన బుధవారం సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ కు సంబంధించిన విషయాల పట్ల సైబర్ క్రైమ్ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.ప్రధానంగా నెట్వర్క్ కనెక్షన్ ద్వారా నేరగాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడటం జరుగుతుందన్నారు. ఫేస్బుక్ వాట్సప్, ఇంస్టాగ్రామ్, మెసెంజర్ వంటి సోషల్ మాధ్యమాల ద్వారా విభిన్న పద్ధతుల అనుసరించి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ‘సైబర్ నేరగాళ్ళ పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే 193 నెంబర్ కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని, వెంటనే చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగుతామని వారు తెలిపారు. అలాగే మొబైల్ ద్వారా వచ్చే కాల్స్ ద్వారా కూడా సైబర్ నేరగాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారని, వీటిపట్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసిపి సిఐ నరసింహారావు, డిపార్ట్మెంట్ ఎస్ఐ రంజిత్, ఏఎస్ఐ వెంకటనారాయణ, బాల్య సిహెచ్ కృష్ణారావు, లింగారావు, కళాశాల సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.