అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు – జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి నాగేందర్ రెడ్డి
అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు
– జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి నాగేందర్ రెడ్డి
మధిర, శోధన న్యూస్ : అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి నాగేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, గురువారం మధిర డివిజన్లోని పలు ఎక్సైజ్ చెక్ పోస్టులను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఎర్రుపాలెం మండలం లోని మీనవోలులో మంజీర మద్యం షాపులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ నిబంధనల ప్రకారం మద్యం షాపులలో మద్యం అమ్మకాలు చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దుల్లోని ఎర్రుపాలెం మండల పరిధిలో గల రాజుపాలెం సరిహద్దు చెక్ పోస్ట్, బోనకల్ మండల సరిహద్దు చెక్ పోస్టులలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం అమ్మకాలు, నల్ల బెల్లం, పటిక, గంజాయి రవాణా సంబంధిత ఎక్సైజ్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై మధిర ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ ఎం ప్రసాద్ కు తగు సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ ఎస్సైలు చంద్రశేఖర్, శార్వాణీ, సిబ్బంది సిహెచ్ గోపి, షేక్ రియాజ్, షేక్ ముస్తఫా పాల్గొన్నారు.