ఖమ్మంతెలంగాణ

దోపిడి దొంగలను జైలుకు పంపే సమయం అసన్నమైంది -బిజెపి జాతీయ కార్యదర్శి  సునీల్

దోపిడి దొంగలను జైలుకు పంపే సమయం అసన్నమైంది

-బిజెపి జాతీయ కార్యదర్శి  సునీల్

సత్తుపల్లి అక్టోబర్ 2 (ప్రభ న్యూస్) గజదొంగలను జైలుకు పంపించే సమయం తొందరలోనే వస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి   సునీల్ థియేదర్ అన్నారు. భారతీయ జనతా పార్టీనియోజకవర్గ కన్వీనర్ బి వీరంరాజు అధ్యక్షతన సత్తుపల్లి నియోజకవర్గ ఎలక్షన్ మేనేజ్మెంట్ టీం సమావేశం గురువారం సత్తుపల్లి లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ థియేదర్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగల పార్టీ అధికారం చలాయిస్తుందన్నారు. కెసిఆర్ నేతృత్వంలోని కుటుంబ పాలనలో కొడుకు, కూతురు, అల్లుడు, అన్న కొడుకు ల దోపిడీకి అదుపు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుటుంబ పార్టీ దొంగలను జైలుకు పంపిస్తామని ఆయన  హెచ్చరించారు. భాజపా నుండి 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు, 2018 సంవత్సరంలో ఒకరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఏ ఒక్కరూ పార్టీ మారలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి బి ఆర్ఎస్ లో చేరారు అన్నారు. తెలుగుదేశం పార్టీ రెండో గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ కు తొత్తులుగా మారారు అన్నారు భారతీయ జనత పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా నంబూరు రామలింగేశ్వర రావు ఎంపిక చేశారు అన్నారు. రామలింగేశ్వర రావు అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలని సునీల్ కోరారు. ఈ సమావేశంలో భాజపా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ,సత్తుపల్లి సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి నంబూరు రామలింగేశ్వర రావు, వెంకటరామయ్య, నున్న రవి నాయుడు రాఘవరావు సుదర్శన్ మిశ్రా మట్టా ప్రసాద్ ఆచంట నాగస్వామి పాలకొల్లు శ్రీనివాస్ భీమిరెడ్డి బాలకృష్ణారెడ్డి కృష్ణయ్య పుల్లారావు వినయ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *