పినపాక నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోడియం బాలరాజు
పినపాక నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోడియం బాలరాజు
మణుగూరు, శోధన న్యూస్: పినపాక నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోడియం బాలరాజు పేరును బిజెపి అధిష్టానం గురువారం ప్రకటించింది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు గ్రామానికి చెందిన పోడియం బాలరాజు బిజెపి పార్టీ నుండి బీఫామ్ అందుకున్నారు. ఈయన తెలంగాణ ఉద్యమ కారుడు పోడియం నరేందర్ సోదరుడు. అనంతరం బిజెపి అభ్యర్థి బాలరాజు మాట్లాడుతూ బిజెపిని పినపాక నియోజకవర్గం లో గెలిపించడం కోసం గడపగడపకు ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని అన్నారు. తన మీద నమ్మకంతో నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.