భార్యను గొడ్డలితో హతమార్చిన భర్త
భార్యను గొడ్డలితో హతమార్చిన భర్త
– పోలీసులు లొంగిపోయిన నిందితుడు
మణుగూరు, శోధన న్యూస్:
కష్ట సుఖాల్లో తోడునివాల్సిన భర్తే కాలయముడై భార్య ను చంపిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున సమితిసింగారం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన కు సంభందించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సమితి సింగారం గ్రామానికి చెందిన గట్టికొప్పుల రాములు, భార్య మంగతాయారు(55)ల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. వీరిరువురు మధ్య గురువారం రాత్రి కూడా గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. గొడవ కారణంగా కోపోద్రేకుడైన రాములు భార్య మంగతాయారు నిద్రిస్తున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున గొడ్డలితో మెడ పై నరికి హతమార్చాడు. తర్వాత నిందితుడు తన భార్యను హత్యచేశానంటూ మణుగూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ సంఘటన పై సిఐ రమకాంత్, ఎస్సై శ్రీనివాస్ తమ సిబ్బంది తో కలిసి ఘటన స్థలానికి చేరుకొని ఘటన కు సంబంధించిన వివరాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.