చెరువులో పడి వ్యక్తి మృతి
చెరువులో పడి వ్యక్తి మృతి
కరకగూడెం, శోధన న్యూస్ : కరకగూడెం మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన సోలం నాగయ్య (65) అనే గేదెలా కాపరి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. ఇందుకు సంబందించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం… సోలం నాగయ్య గేదెల కాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటి లాగానే గేదలను మేతకు చెరువుగట్టు ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కళ్ళు తిరిగి నాగయ్య పక్కనే ఉన్న చెరువుల్లో పది మృతి చెందాడు.ఈ విషయాన్ని స్థానికులు కరకగూడెం పోలీసులకు సమాచారం అందిచడంతో,పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలలు ఉన్నారు. పెద్ద దిక్కు కోల్పవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కరకగూడెం మండల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య,రావుల శ్రీను,చిట్టిమల్ల ప్రవీణ్,చిట్టి సతీష్, గుర్రం లాలయ్య,ఇనుమల రామకృష్ణలు సోలం నాగయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ప్రగాడ సానుభూతి తెలిపారు.