ఎమ్మెల్యే సండ్ర ఎన్నికల ప్రచారం
ఎమ్మెల్యే సండ్ర ఎన్నికల ప్రచారం
పెనుబల్లి, శోధన న్యూస్ : పెనుబల్లి మండలంలో సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని కర్రలపాడు, బ్రహ్మలకుంట, తాళ్లపెంట, గంగదేవపాడు, గణేష్ పాడు గ్రామాలలో ప్రచార వాహనంపై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. బీఆర్ ఎస్ పార్టీ ఎన్నికల మానిపేస్ట్ లోని హామీలను ప్రజలకు వివరించారు. కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తు పై ఓటు వేసి నాలగోవ సారి శాసన సభ్యుడుగా నన్ను మూడవసారి ముఖ్యమంత్రి గా కె సి ఆర్ ను గెలిపించి ప్రజా రంజిక పరిపాలన అందించే అవకాశం ఇవ్వమంటూ ఓటర్లను కోరారు. ఆయన వెంట లక్కినేని ఆలేఖ్యవీనీల్ జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు, కోటగిరి సుధాకర్ బాబు, కనగాల వెంకట్ రావు, మందడపు అశోక్ కుమార్, రాయపూడి మల్లయ్య, కొత్తగుండ్ల అప్పారావు, తాళ్లూరి శేఖర్ రావు, లగడపాటి శ్రీనివాసరావు, పసుమర్తి వెంకటేశ్వర రావు, కొప్పుల గోవింద్ రావు, భూక్యా ప్రసాద్, మల్లెల సతీష్ తదితరులు పాల్గొన్నారు.