తెలంగాణ

తెలంగాణ ఉద్యమకారులే కీలకం- టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణ ఉద్యమకారులే కీలకం

  • టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం

వరంగల్ ,శోధన న్యూస్: త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో గత 10 ఏండ్లుగా దోపిడి చేస్తున్న కేసిఆర్ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడం వల్లనే బిఆర్ఎస్ పార్టీని ఓడించగలమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. టీజేఎస్ హన్మకొండ జిల్లా అద్యక్షులు చిల్లా రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఆదివారం హన్మకొండ జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని తెలంగాణ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఓడించడంలో ఉద్యమకారుల పాత్రపై మాట్లాడారు.పేపర్ లీకులతో పాలన చేస్తూ తెలంగాణలో ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్లు చెపుతున్న కెసిఆర్ తప్పుడు లెక్కలను ప్రజలకు వివరించాలని, ధరణి తీసేస్తారని, ధరణి తీసేస్తే రైతులకు నష్టమని బెదిరిస్తున్న కెసిఆర్ మాటలు నమ్మొద్దని అన్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన అభివృద్ధిని కావాలనే కాలరాచాడని, జిల్లా పేరుతో నగరాన్ని రెండు ముక్కలు చేసి ఓరుగల్లు చరిత్రను కావాలనే కనుమరుగు చేసిన కెసిఆర్ ను ఓడించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీర్ఘకాలిక చరిత్ర, అనుభవం కలిగిన మేము దుష్ట పాలనను అంతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మద్దతు పలుకుతున్నామని అన్నారు. రానున్న కాలంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగించాలని, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేయాలని, ఉద్యమకారుల అభివృద్ధి బోర్డును నియమించడం లాంటి ముఖ్యమైన విషయాల అమలుతో కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నామని చెప్పారు. ఉద్యమకారులు, మేధావులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ ఏకమై బిఆర్ఎస్ దుష్టపాలనను అంతం చేయడం కోసం రానున్న 25 రోజులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ… తెలంగాణలో దోపిడి పాలన కొనసాగించిన బిఆర్ఎస్ పార్టీని ఓడించాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ ప్రజలకు ఉద్యమ నాయకులుగా నాయకత్వం వహించి దుష్ట పాలన అంతం చేయాలని పిలుపునిచ్చారు. కోదండరామ్ లాంటి ఉద్యమకారులను అణచివేసి ఉద్యమ ద్రోహులకు అధికార పదవులిచ్చిన కెసిఆర్ నేడు ఉద్యమకారులను బైండోవర్ పేరుతో వేధింపులు చేస్తున్నాడని, ఇంతటి దుష్ట పాలనను అంతం చేయడానికి ఉద్యమకారులు ప్రతిన బూనాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *