తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఇంటింటా ఎన్నికల ప్రచారంలో రేగా  

ఇంటింటా ఎన్నికల ప్రచారంలో రేగా  

బూర్గంపాడు, శోధన న్యూస్: మొరంపల్లి బంజర గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఎన్నికల ప్రచారంలో కార్యక్రమంలో పాల్గొని ఇంటింట తిరుగుతూ ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పేదలకు అవసరమైన అనేక సంక్షేమ పథకాలను తెచ్చింది తామేనని ఆయన అన్నారు, 10 ఏళ్లలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది అన్నారు, సుమారు 60 పథకాలు తెచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం ముందు ఆరు గ్యారంటీలో అంటూ కాంగ్రెస్ చేస్తున్న హడావుడిని చూసి ప్రజలు నవ్వుతున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఓటర్లకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని అన్నారు.  జరగబోయే ఎన్నికల్లో  బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని  అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *