ప్రజా ఆశీర్వాద సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రజా ఆశీర్వాద సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
దమ్మపేట, శోధన న్యూస్ : ఈనెల 13న జరగనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాఆశీర్వాద సభ సభాస్థలిని ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. దమ్మపేట పట్టణ పరిధిలోని మల్లారం రైతు వేదిక సమీపంలోని 10 ఎకరాల స్థలాన్ని సభ కోసం అనువుగా ఉంటుందని ఆ స్థలాన్ని ఇతర నేతలతో కలిసి పరిశీలించారు. తొలుత డిఎస్పి వెంకటేష్ సైతం సభాస్థలిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ ,జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్, దమ్మపేట సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు ,యార్లగడ్డ బాబు, యార్లగడ్డ శ్రీను, వైస్ ఎంపీపీ మల్లికార్జునరావు, రామకృష్ణ ,అబ్దుల్ జిన్నా, చిన్నంశెట్టి సత్యనారాయణ, శ్రీరాముల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.