9న జిల్లా స్థాయి అండర్-13 చెస్ పోటీలు
9న జిల్లా స్థాయి అండర్-13 చెస్ పోటీలు
సత్తుపల్లి, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా ఛెస్ అసోసియేషన్ వీ కింగ్స్ చెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో
అండర్ 13 జిల్లా స్థాయి ఓపెన్ ఛెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఛెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వనమా శ్రీనివాస్, జిల్లాస్థాయి సెక్రటరీ ఎస్ కె రఫి లు తెలిపారు. సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న మండల పరిధిలోని గంగారంలో గల సాయి స్ఫూర్తి డిఏవి పాఠశాలలో ఉదయం 9గం లకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు 2010 జనవరి తర్వాత జన్మించిన వారై ఉండాలని సూచించారు. విజేతలు ఈనెల 10 నుండి 12 వరకు 2 రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి అండర్ 13 ఓపెన్ చెస్ పోటీలలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. క్రీడాకారులు వారి వారి సొంత చెస్ బోర్డు, చెస్ పీసెస్ తో పాల్గొనవలెనని తెలిపారు. వివరాల కోసం 8978171448 కు సంప్రదించాలని టోర్నమెంట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.