ఎమ్మెల్యేగా ఆదరించి గెలిపించండి -కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ది రాందాస్
ఎమ్మెల్యేగా ఆదరించి గెలిపించండి
-కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ది రాందాస్ నాయక్
వైరా, శోధన న్యూస్: వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన రాందాస్ నాయక్ నియోజకవర్గ కేంద్రమైన వైరా లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు రాందాస్ నాయక్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి ఆదరించి గెలిపించాలని వైరా నీ అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమపై అధిష్టానం ఎంతో నమ్మకం ఉం చి టికెట్ కేటాయించటం ఎంతో గర్వకారణంగా ఉందని, సహకరించిన ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కరించారు. అందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించా లని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కేంద్రమైన వైరాలో ఉదయం నుంచి రాత్రి వరకు ముఖ్య నేతలను నాయకులను కలిసి సహకరించాలని కోరారు.పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.