కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
మణుగూరు, శోధన న్యూస్: పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం తోగ్గుడెం గ్రామ పంచాయతీ, అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామాల నుండి పలువురు ముఖ్య నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రెండు సార్లు వచ్చినా ప్రజలకు అభివృద్ధి జరగలేదన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లుగా అమలు చేయని పథకాలు… ఇప్పుడు ఎలా ఇస్తారని మేనిపెస్టోలో పెట్టారని అన్నారు. గతంలో ఇచ్చిన పథకాలు ఒక్కటి కూడా పేదవారి ధరి చెరలేదన్నారు. .పేద ప్రజలకి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అని అయన అన్నారు. మీ అమూల్యమైనా ఓటును చేతి గుర్తు పై వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆయన కోరారు . ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, వైస్ ఎంపీపీ కరివేదా వెంకటేశ్వరరావు, రామచంద్రపురం సర్పంచ్ కాకా అశోక్, ఉపసర్పంచ్ వీరంకి వెంకట్రావుగౌడ్, సినియర్ నాయకులు సామ శ్రీనివాసరెడ్డి, టీవి సుబ్బారెడ్డి, బూరెడ్డి వెంకట్ రెడ్డి, చుంచు ఏకంబరం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.