బిఆర్ఎస్ తోనే రాష్ట్రం సుభిక్షం-ప్రభుత్వ విప్ రేగా
బిఆర్ఎస్ తోనే రాష్ట్రం సుభిక్షం
- గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్:బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 50 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పదేళ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీకి బలమని గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్లాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సీఎం కేసీఆర్ వెంట ఉన్నారని ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ దే మళ్లీ అధికారం ఎవరేం చేసిన అది ఆగేది కాదన్నారు. 100 సీట్లు పైగా విజయం సాధించడం ఖాయమని ఆయన అన్నారు. పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.