యువత రాజకీయాల్లోకి రావాలి
యువత రాజకీయాల్లోకి రావాలి
-కొత్తగూడెం ఇండిపెండెంట్ అభ్యర్థి శేషగిరిరావు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : కొత్తగూడెం ఇండిపెండెంట్ అభ్యర్థి గా దొడ్డపనేని శేషగిరిరావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మణుగూరు లో ఔట్సోర్సింగ్ సైట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న శేషగిరిరావు యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. ప్రజలను ఉచితాలకు అలవాటు చేసి నాయకులు వారి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఎంత మంది నాయకులూ గెలిచినా యువతకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎవరో రావాలి మనకు ఏదో చేయాలి అని యువత చూడొద్దని యువత భావిష్యతునే ప్రధానం గా భావించి పోటిలో నిలబడాలి అని భావించి నామినేషన్ దాఖలు చేశాను అని అన్నారు . సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేయాలనే ఆలోచనతో వున్నాను అని అందుకే యువత రాజకీయాల్లోకి రావాలని తెలిపారు. పర్యావరణం కలుషితమవుతున్నా ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, ప్రజల జీవన ప్రమాణం పెంచే దిశగా చర్యలు చేపట్టేందుకు తను ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కరించేందుకు చిత్తశుద్ధి తో పనిచేస్తానని, తనను ఆదరించి కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు గెలిపించాలని కోరారు. యువత భావిస్యత్తుకు పెద్దపీట వేయాలన్న ఆలోచనతో మణుగూరు యువకుడు కొత్తగుడెం జనరల్ స్థానం లో నామినేషన్ వేయడం పట్ల మణుగూరు రాజకీయ నాయకులూ , విద్యార్ధి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తు శేషగిరిరావు అభినందిస్తూ ఘన విజయం సాధించాలని ఆశించారు.