సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలిరండి – ప్రభుత్వ విప్ రేగా
సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలిరండి
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
- ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలన
మణుగూరు, శోధన న్యూస్: ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఈనెల 13వ తేదీన జరగనున్న బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ప్రజా ఆశీర్వాద సభా స్థలి ఏర్పాట్లను పరిశీలించి అక్కడ జరుగుతున్న పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడోసారి సీఎం కేసీఆర్ ని గెలిపించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటి కే అన్నీ సర్వేలు బిఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, ప్రజల మనసులో రాబోయే 30 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీకే తెలంగాణ అధికారం కట్టబెడతారని ఆయన తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి సుమారు 60 వేల మంది ఈ సభకు హాజరవుతున్నట్లు తెలిపారు. సభకు ప్రజలను మరింత ఉత్సాహ పరిచేదందుకుగాను గాయకుల బృందం సైతం హాజరవుతున్నట్లు తెలిపారు.సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు నాయకులు , అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.