సభాస్థలిని పరిశీలించిన ఓ ఎస్ డి అధికారులు
సభాస్థలిని పరిశీలించిన ఓ ఎస్ డి అధికారులు
దమ్మపేట ,నవంబర్10( ప్రభ న్యూస్): ఈనెల 13న ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే మండలంలోని మల్లారంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభ స్థలిని జిల్లా ఓఎస్డి అధికారుల బృందం శుక్రవారం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సభ నిర్వహణపై స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకొని ఏర్పాట్లను పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్పెషల్ ఓఎస్డి అధికారులు పాల్గొన్నారు.