ఘనంగా దీపావళి వేడుకలు
ఘనంగా దీపావళి వేడుకలు
సత్తుపల్లి , శోధన న్యూస్ : పట్టణములో ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో దీపావళి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పిల్లలు,పెద్దలు,మహిళలకు ఎంతో ప్రీతికరమైన పండుగ కావడంతో అత్యంత శోభాయ మానంగా గృహాలను తీర్చిదిద్దారు. వేకువ జామునే లెచి మంగళ హారతులు నిర్వహించి, తల స్నానాలు ఆచరించి, నూతన వస్త్రాలను ధరించి,గృహాలను మామిడి తోరణాలు, పువ్వులు,విద్యుత్ దీపాలతో అలంకరించారు.ఉదయం నుండి ఉపవాసం ఉండి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని నిర్వహించారు. కేదారేశ్వర స్వామి వ్రతాన్ని దీపావళి నోములని అంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. మన సంస్కృతి,సాంప్రదాయాలను నేటి తరం పిల్లలు కొనసాగించడానికి ఇలాంటి పండుగలు ఎంతో ఉపయోగపడతాయి.కాకర్లపల్లి రోడ్డు లోని వెంకటేశ్వర రెసిడెన్షియల్ బహులాంతస్తుల భవనంలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి.మహిళలు అమ్మవారికి లక్ష్మీ పూజలను నిర్వహించారు. అందరూ కలిసి పోయి చిన్న పెద్ద తేడా లేకుండా కాకర వత్తులు,చిచ్చుబుడ్లు, భూచక్రాలు,విష్ణు చక్రాలు, మతాబులు,వెన్నెల మడుగులు పలు రకాల బాణాసంచా కాల్చి ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బండారు ఉమామహేశ్వరరావు, సంధ్యారాణి,పూరేటి శ్రీనివాసరావు,రాజ్యలక్ష్మి, మహేంద్రవాడ సత్య శ్రీనివాసరావు,సత్యలక్ష్మి, అడపా వాసుదేవరావు, శైలజ దంపతులతో పాటు నాతి రాజేశ్వరి,వరుణ్, చైతన్య, జ్ఞాప్తిక తదితరులు పాల్గొన్నారు.