ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
చండ్రుగొండ, శోధన న్యూస్ : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల నోడల్ అధికారి సహజ సుల్తానా సూచించారు. సోమవారం చండ్రుగొండ మండల కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కళాజాత కార్యక్రమంలో ఆమె పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు. ఓటు వజ్రాయుధమని ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకుని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మంచి నాయకుని ఎన్నుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రేవతి హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ కళాబృందం బాధ్యులు కాంపల్లి బాబు, మిట్టపల్లి నరేందర్, ఎస్కే మోసా, నందు, స్నేహ, నీల, కౌసర్ తదితరులు పాల్గొన్నారు.