తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ప్రజా బాంధవుడు సిఎం కెసిఆర్- ప్రభుత్వ విప్  రేగా కాంతారావు 

ప్రజా బాంధవుడు సిఎం కెసిఆర్

-మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే   
– ప్రభుత్వ విప్  రేగా కాంతారావు 

కరకగూడెం, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్రం లో అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం తపనపడే ప్రజా బాంధవుడు  సీఎం కెసిఆర్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ళ గ్రామపంచాయతీ పరిధిలోని పోలకమ్మతోగు గ్రామంలో  ప్రభుత్వ విప్  రేగా కాంతారావు   ఎన్నికల ప్రచారంలో భాగంగా వరి కోత కోస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారితో కాసేపు వరి కోసి, వారితో మాట్లాడి ఈనెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు, అదేవిధంగా పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా ఏకమవుతున్న శత్రువుల నాటకాలకు రాబోయే 14 రోజుల పాటు నిరంతరం ప్రజాక్షేత్రం లో బీఆర్ఎస్ సైనికులు తిప్పి కొట్టాలి అని పిలుపు నిచ్చారు. గడ గడపకు మ్యానిఫెస్టోను చేర్చే బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులదే అన్నారు. కాంగ్రెస్‌ హామీలు నీటిమూటలే అని, మ్యానిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత దేశంలో బీఆర్ఎస్ పార్టీ ది మాత్రమే అన్నారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లపాటు ఉద్యమించి, కేంద్రంతో కొట్లాడి సాధించుకొన్న తెలంగాణను ఈ పదేండ్లలో సాగు, తాగునీరు, మౌలిక వసతులు, సబ్బండ వర్గాల అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు, దేశంలోనే మిన్నగా ఐటీ అభివృద్ధి, రైతుల సర్వతోముఖాభివృద్ధి, మహిళాభ్యున్నతి, గ్రామాలు, పట్టణాల అభివృద్ధి…. ఇలా ఏ రంగం చూసిన అభివృద్ధిలో ముందుకుపోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ అభివృద్ధి పరుగులు ఆగకుండా ఉండాలంటే.. అందరూ ఆశించిన బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలంటే ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చి, కేసీఆర్‌ ను ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే మార్గం అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రకటించిన బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందన్నారు. ఇప్పటికే రైతుబీమా తరహాలో బీమా సౌకర్యం కల్పిస్తుండగా ఇక నుంచి తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.5లక్షల బీమా అందిస్తుందని ప్రకటించారన్నారు. రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేలు, రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం, రైతుబంధు రూ.16వేలు, ఆసరా పెన్షన్లు పెంపు వంటి వినూత్న పథకాలు ప్రకటించారని, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఆ పథకాలన్నీ అమలుచేసే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్‌  కే ఉందన్నారు.  దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్‌  ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. పినపాక నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *