కార్మిక నేత పిట్టల అర్జున్ ను గెలిపించాలి
కార్మిక నేత పిట్టల అర్జున్ ను గెలిపించాలి
ములకలపల్లి, శోధన న్యూస్ :కార్మిక వర్గ ఉద్యమ పోరాటాలు ఉధృతంగా నిర్వహించిన ఉద్యమ నేత సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్ పిట్టల అర్జునుని గెలిపించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి అప్పారావు కోరారు. గురువారం మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన జండాల బాడి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కార్మిక వర్గ మేనిఫెస్టోను విస్మరించిన పార్టీలను ఓడించాలని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ప్రశ్నించే గొంతు ను అసెంబ్లీకి పంపించాలని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పాలించే ప్రభుత్వాలు కార్మికులకు వేతనాలు పెంపు కోసం నేడు అసెంబ్లీలో కార్మిక వర్గ సమస్యల పట్ల స్పందించే పార్టీలు ప్రజాప్రతినిధులు లేరని అన్నారు. మన కార్మిక వర్గ సమస్యలకు అనునిత్యం స్పందించే నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు. కార్మిక నాయకుడు కామ్రేడ్ పిట్టల అర్జున్ ను అసెంబ్లీకి పంపింస్తే కార్మిక వర్గనికి అండదండగా రక్షణగా నిలుస్తాడని అన్నారు. కార్మిక వర్గం కలిసికట్టుగా ఐక్యంగా ఎమ్మెల్యే అభ్యర్థి పిట్టల అర్జునునికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దుబ్బా ధనలక్ష్మి, సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు, మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ మండల కార్యదర్శి బుగ్గ వెంకట నరసమ్మ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి ఓరుగంటి శ్రీను, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి వర్క రుక్మాధవ్ రావు, సంగం అంజమ్మ, నల్లి సుజాత, అన్నవరపు శైలజ, మాణిక్యమ్మ, అనసూర్య,తదితరులు పాల్గొన్నారు.