తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

 తెలంగాణను దోచుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం-కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ

 తెలంగాణను దోచుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం 

-దండుకున్న ప్రతీ రూపాయి ప్రజలకు చేరుస్తాం 

-కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ

మణుగూరు, శోధన న్యూస్  : పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, కాంగ్రెస్ తుపానులో ఈసారి కొట్టుకుపోక తప్పదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ  నుండి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన మణుగూరుకు చేరుకున్నారు. ఉదయం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీ సంఖ్యలో అంబేద్కర్ సెంటర్ చేరుకోవడంతో మణుగూరు పట్టణం జన సంద్రాన్ని తలపించింది. అడుగడుగునా రాహుల్, రేవంత్, జై కాంగ్రెస్ నినాదాలతో మణుగూరు పట్టణం మారుమోగింది. ప్రతి పల్లె పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా భారీ సంఖ్యలో అశేష జనావాహిని రాహుల్ గాంధీ ప్రసంగం  కోసం  ఎదురుచూసింది. మండుటెండను కూడా లెక్కచేయకుండా అభిమానులు ప్రజలు మహిళలు రాహుల్ కోసం ఎదురు చూశారు. మధ్యాహ్నం హెలికాప్టర్లో మణుగూరు చేరుకున్న ఆయన ప్రభుత్వ  జూనియర్ కళాశాల నుండి  అంబేద్కర్ లో కార్నర్ మీటింగ్ కు చేరుకొని ప్రజలకు అభివాదం చేసి ప్రసంగించారు.   పదేళ్లు దోచుకున్న పాలనకు అంతం పలికే రోజు వచ్చిందన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని రాహుల్ అన్నారు. మీరు చదివిన స్కూల్, వేసిన రో
డ్డు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసిందేనని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కాంగ్రె స్ అధికారంలోకి బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లడం ఖాయమన్నారు.  కేసీఆర్ ప్రభుత్వంలో దోచుకున్న సొమ్మంతా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలకు పంచుతామని తెలిపారు. రైతులు, పేదలను కేసీఆర్ వంచించారని తెలిపారు. వారు దోచుకున్న డబ్బులను పేదల బ్యాంక్ ఖాతాలో వేస్తామని,  కాంగ్రెస్  ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. కాగ్రేస్ ప్రభుత్వ కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో  వెంటనే గ్యారంటీలను అమలు చేశామని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా కాంగ్రెస్ పాలన సాగుతుందని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలూ ఒక్కటేనన్న రాహుల్ కాంగ్రెస్ ను ఓడించేందుకు మూడు పార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. తెలంగాణతో మా కుటుంబానికి రాజకీయ సంబంధం కాదు.. అనుబంధం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2014 లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర్రాన్ని ఇచ్చిందని తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేశారన్నారు. తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించామని.. కానీ, తెలంగాణలో అధికారంకెసిఆర్ కుటుంబానికే పరిమి
తమైందని మండిపడ్డారు.  తెలంగాణ ప్రజాధనం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూస్తున్నామని… కాం
గ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరికీ సంపదను పంచుతామని రాహుల్ గాంధీ  తెలిపారు. మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇవ్వడంతోపాటు గ్యాస్ సిలిండర్ ను రూ.500కేఅందిస్తామన్నారు.అ లాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు.  తెలంగాణలో పేదలు, రైతుల సర్కార్ ను ఏర్పాటు చేస్తామని  తెలిపారు. తెలంగాణతో తనకున్నది రాజకీయ సంబంధం కాదని, రక్త సంబంధం ఆని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుందన్నారు. ఓ కుటుంబం కోసం తెలంగాణ ఏర్పాటు చేయలేదని,తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పాటు చేశామన్నారు. కేసీఅర్ 24 గంటల ఉచిత విద్యుత్ వస్తోందా? కేసీఅర్ ఇంట్లో మాత్రమే విద్యుత్ ఉందేమో?, ఆయన ఇంట్లో నుంచి బయటకు రారు గనుక కేసీఆర్‌కు తెలియదని, ఆయన మాదిరి ఉత్తుత్తి మాటలు చెప్పం.. ఆరు గ్యారంటీ పథకాలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు.అలాగే అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే అని, ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ ఎన్నికల తర్వాత మోదీని కూకటి వేళ్ళతో పెకిలిస్తాం అని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. ఈ సభలో పిసిసి ప్రచార కమిటీ కో- కన్వీనర్, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, భద్రాచలం నియోజక
వర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య, పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు పాయం వెంకటే
శ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, పోలేబోయిన శ్రీవాణి, బట్ట విజయ గాంధీ, లతో పాటు భారీగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *