సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి
సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి
– బి ఆర్ ఎస్ జిల్లా నేత పోట్ల శ్రీనివాసరావు
కొణిజర్ల, శోధన న్యూస్ : ఈనెల 21నరాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజా ఆశీర్వాద సభను భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని బి ఆర్ ఎస్ జిల్లా నేత పోట్ల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.శుక్రవారం కొణి జర్ల మండలంలోని అంజనాపురంగుబ్బ గుర్తి పెద్దరామాపురం లక్ష్మీపురం గ్రామాల్లో పిఎస్ఆర్ విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ముఖ్య కార్యకర్తలకు నాయకులకు దశ దిశ చేశారు.సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఆశీర్వాద సభ వైరా పట్టణ సమీపంలో జరగనున్న సందర్భంగా భారీ జన సమీకరణ చేయాలని రైతులు రైతు కూలీలు బడుగు బలహీన వర్గాలు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు అన్ని వర్గాల ప్రజలను కూడా అధిక సంఖ్యలో తరలించే విధంగా ప్రతి నాయకుడు గ్రామస్థాయిలో కీలకపాత్ర పోషించి ఇరివిగా తరలించాలని విజ్ఞప్తి చేశారు.మదన్ లాల్ పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం జయప్రదం కోరుతూ ఆయా గ్రామాల్లోని నాయకులను కార్యకర్తలను సిద్ధం చేసే విధంగా ప్రత్యేక సమావేశాలు శ్రీనివాసరావు నిర్వహించి నేడు పర్యటన కోసం పార్టీ శ్రేణులకు విజయవంతమైన కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలోసర్పంచ్ రాంబాబు రవి చల్లగుండ్ల సురేష్ బాబూలాల్ నాగేశ్వరరావు ప్రసాద్ బాలస్వామి సర్పంచి రోషన్ బేగ్ కృష్ణ ముస్తఫా ప్రసాద్ రామారావు వడ్లమూడి గోపాలరావు నరసింహారావు యాదయ్య విజయ్ తులసి రామ్ ఉపసర్పంచ్ రామ్మూర్తి ఆచారి నరసింహారావు వెంగళరావు విష్ణు బుర్ర కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.