జనసేన అభ్యర్థి గెలుపు కోసం వినూత్న ప్రచారం
జనసేన అభ్యర్థి గెలుపు కోసం వినూత్న ప్రచారం
అశ్వారావుపేట, శోధన న్యూస్ : ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అశ్వారావుపేట నియోజకవర్గం నుండి బిజెపి బలపరిచిన జనసేన అభ్యర్థి ముయ్యబోయిన ఉమాదేవి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం ప్రారంభం నుండి ఆమె గత కొద్దిరోజులుగా పట్టణంలోని అన్ని ప్రాంతాలలో వినూత్న ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తోపుడు బండ్ల వద్ద బజ్జీలు వేస్తూ, ఇండ్ల వద్దకు ఓట్లు అభ్యర్థించడానికి వెళ్ళినప్పుడు బట్టలు ఉతుకుతూ, తినుబండారాలను చేస్తూ వినూత్న ప్రచారం చేశారు. స్వచ్ఛమైన ప్రజాపాలన కావాలంటే నియోజకవర్గ ఓటర్లు జనసేన బిజెపి తరపున పోటీ చేస్తున్న తనను గాజు గ్లాసు గుర్తుపై నియోజకవర్గ ఓటర్లు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉమాదేవి అభ్యర్థిస్తున్నారు. ప్రజలు ఓటుకి నోటు రాజకీయాలకు ప్రభావితం కాకుండా నిస్వార్ధంగా తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నిటిని వరుస క్రమంలో తూ.చ తప్పకుండా పరిష్కరిస్తానని ఉమాదేవి ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార పర్వంలో పలువురు జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.