కోరం సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరిక
కోరం సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరిక
ఇల్లందు, శోధన న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మడత వెంకట్ గౌడ్ ముఖ్య అనుచరులు బొల్లి రాజుతో సహా మరో నలభై మంది యువకులు శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఆయన కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కాంగ్రెస్ గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని కోరుతూ,కెసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ ధమ్మాలపాటి వెంకటేశ్వర్లు,మాజీ ఛైర్మెన్ అనసూర్య,మాజీ వైస్ చైర్మన్ రమేష్ చంద్ర గుప్త,కౌన్సిలర్ వార రవి,పట్టణ అధ్యక్షుడు దొడ్డా డానియెలు,ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్,నాయకులు ఎండీ ఝానీ,మడుగు సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,చిల్లా శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.