ఖమ్మంతెలంగాణ

 సంస్థ అభివృద్ధి సమిష్టి కృషితోనే సాధ్యం-ఖమ్మం రీజినల్ మేనేజర్  వెంకన్న

 సంస్థ అభివృద్ధి సమిష్టి కృషితోనే సాధ్యం

-ఖమ్మం రీజినల్ మేనేజర్  వెంకన్న

సత్తుపల్లి, శోధన న్యూస్ : ఉద్యోగుల సమిష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆర్టిసి అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్లే కీలకమని ఖమ్మం రీజినల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న తెలిపారు. శనివారం సత్తుపల్లి డిపోలో ఏర్పాటుచేసిన రీజినల్ స్థాయి ప్రగతి చక్ర అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై  ప్రసంగించారు. ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరించడం వల్ల అధిక ఆదాయం పొందటం సాధ్యమవుతుందని అన్నారు. ఖమ్మం రీజన్ పరిధిలోని ఏడు  డిపోలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది డ్రైవర్లు, ఏడుగురు  కండక్టర్లు, ముగ్గురు టిమ్ము లో డ్రైవర్లు ఐదు  ప్రైవేటు బస్సు డ్రైవర్లు లను, ముగ్గురు మెకానిక్ లను శాలువాలతో, నగదు పురస్కారాలతో సన్మానించారు. అదేవిధంగా ఉత్తమ బస్ స్టేషన్ గా ఎంపికైన ఖమ్మం పాత బస్టాండ్ డిపో మేనేజర్ ను ఆయన  సన్మానించారు. ఉద్యోగులు ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ ఎక్కువ ఆదాయం తేవడానికి నిరంతరం కృషి చేయాలని అన్నారు. తొందరలోనే కొత్తగూడెం బస్ స్టేషన్ నందు ఆర్టిసి డిస్పెన్సరీని ఏర్పాటు చేయడం జరుగుతుందని దీంతో మణుగూరు, భద్రాచలం డిపోల పరిధిలోని ఉద్యోగులు ఉపశమనం కలిగే అవకాశం ఉందన్నారు. ప్రగతి చక్ర అవార్డులకు ఖమ్మం రీజన్ పరిధిలో మొత్తం 25 మంది ఎంపిక కావడం సంతోషంగా ఉందని మున్ముందు ఎక్కువమంది అవార్డులు పొందేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి, ఖమ్మం డిపో మేనేజర్ శ్రీనివాసరావు, భద్రాచలం డిపో మేనేజర్ రామారావు, మణుగూరు డిపో మేనేజర్ స్వామి, అసిస్టెంట్ మేనేజర్లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *