పేద కుటుంబానికి జీవిత బీమా అండ – డిప్యూటీ తహశీల్దార్ భరణి బాబు
పేద కుటుంబానికి జీవిత బీమా అండ
– డిప్యూటీ తహశీల్దార్ భరణి బాబు
చర్ల, శోధన న్యూస్ : పేద కుటుంబానికి జీవిత బీమా అండగా ఉంటుందని చర్ల మండల డిప్యూటీ తహశీల్దార్ బీరవెల్లి భరణి బాబు అన్నారు. మండల కేంద్రానికి చెందిన బెల్లంకొండ తిరుపతమ్మ తన భర్తను కోల్పోయి ఒక్కగా నొక్క కుమారుడిని ఉన్నత చదువులు చదివిస్తూ, ఎల్ఐసి ఏజెంట్ అయిన మోతుకూరి ప్రభాకర్ రావుకు ఐదు లక్షలకు భీమాకు గాను, సంవత్సరానికి 27,832 రూపాయల చొప్పున చెల్లిస్తూ ఇప్పటివరకు1,66,992 రూపాయలు కట్టారు.గతంలో తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఇట్టి బీమాపై 96,042 వేల రూపాయలు పొందియున్నారు.ఇంకా వీరి కట్టిన నగదు 70,950 రూపాయలు ఎల్ఐసి బీమా లో ఉంది. దురదృష్టవశాత్తు గత నెలలో ఆమె డెంగ్యూ బారిన పడి మరణించడంతో ఎల్ఐసి ఏజెంట్ ప్రభాకర్ రావు చొరవతో క్లెయిమ్ అయిన నగదు 5,37,438 రూపాయల చెక్కును శనివారం డిప్యూటీ తహసిల్దార్ భరణి బాబు చేతుల మీదుగా ఆమె కుమారుడు బెల్లంకొండ సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్ ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.