భట్టి విక్రమార్క తోనే మధిర అభివృద్ధి సాధ్యం
భట్టి విక్రమార్క తోనే మధిర అభివృద్ధి సాధ్యం
మధిర , శోధన న్యూస్ : పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టిందని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క తనయుడు యువనేత మల్లు సూర్య విక్రమాదిత్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కను గెలిపించాలని కోరుతూ పట్టణంలో 17వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మల్లు సూర్య విక్రమాదిత్య మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్వంత స్థలం కలిగి ఉన్న పేదలకు సొంతిల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తుందన్నారు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతి నెలా రూ. 2500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇంట్లో చదువుకునే ఆడపిల్లలకు ఎలక్ట్రికల్ స్కూటీని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని అన్నారు, రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా ఎకరాకు రూ.15వేలు పెట్టుబడి సాయం, వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే కూలీలకు ప్రతి ఏటా రూ.12వేలు , వరి పంట పండించే రైతులకు మద్దతు ధరకు అదనంగా మరో రూ.500 బోనస్ కింద కలిపి చెల్లిస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. మధిర అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క అఖండ విజయంతో గెలిపించాలన్నారు. మధిర ప్రజల ఆశీర్వాదంతో భట్టి విక్రమార్క మూడుసార్లు గెలిచారని, మధిరను ఎంతో అభివృద్ధి చేశారని, నాలుగో సారి కూడా ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిర్యాల రమణగుప్త కౌన్సిలర్ కోన ధని కుమార్,రంగా శ్రీనివాసరావు, పారుపల్లి విజయ్, యన్నం కోటేశ్వరావు, దేవిశెట్టి రంగారావు, చావలి రామరాజు, మునుగోటి వెంకటేశ్వర్లు, బాహటం రాజు ఎర్రగుంట రమేష్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ తూమాటి నవీన్ రెడ్డి, నిడమానూరు వంశీ, గుండె మెడ బాలాజీ, తలుపుల వెంకటేశ్వర్లు తదితులున్నారు.