పంచాయతీ కార్యాలయం ముందు దీక్షకు దిగిన మహిళ
పంచాయతీ కార్యాలయం ముందు దీక్షకు దిగిన మహిళ
అశ్వాపురం, శోధన న్యూస్ : అశ్వాపురం మండల పరిధిలోని మొండికుంట గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సోమవారం మొండికుంట గ్రామానికి చెందినఓ మహిళ నిరసన దీక్ష చేపట్టింది. బాధితురాలు కట్ట సామ్రాజ్యం కథనం ప్రకారం. సామ్రాజ్యం తన భర్త పిల్లలతో కలిసి కొన్నాళ్ల క్రితం బ్రతుకుదెరువు కోసం వేరే ఊరికి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన తన సమీప బంధువులు తమ ఇంటిని తన అత్త పేరు మీదికి పంచాయతీ కార్యాలయంలో నమోదు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న సామ్రాజ్యం తన భర్తతో కలిసి పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పంచాయతీ కార్యదర్శిని సర్పంచిని కలిసి మాట్లాడారు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప తనకు న్యాయం చేయట్లేదని సోమవారం సామ్రాజ్యం తన కూతురితో కలిసి కార్యాలయం ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారి నిరసన దీక్ష గురువర్గాలవారు కూర్చొని పెద్దమనుషుల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలని వారికి సూచించారు.