తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సీఎం కేసీఆర్ రా ష్ట్రానికి ఒక ధీమా…ప్రభుత్వ విప్  రేగా కాంతారావు

సీఎం కేసీఆర్ రా ష్ట్రానికి ఒక ధీమా…

-సంక్షేమ పాలన బిఆర్ఎస్ కే సాధ్యం 

-సీఎం కేసీఆర్  సహకారంతో నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి 

-అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న బిఆర్ఎస్ మ్యానిఫెస్టో

-ప్రభుత్వ విప్  రేగా కాంతారావు

– బిఆర్ఎస్ పార్టీలో  భారీగా  చేరికలు 

మణుగూరు, శోధన న్యూస్ : సీఎం కేసీఆర్ రా ష్ట్రానికి ఒక ధీమా అని… ప్రజా  సంక్షేమ పాలన బిఆర్ఎస్ కే సాధ్యం అని ప్రభుత్వ విప్, బిఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.  ప్రభుత్వ విప్  రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మణుగూరు మండల అధ్యక్షులు గురజాల గోపి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 1500 కుటుంబాలు, వీరితోపాటు ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ అశ్వాపురం ఎంపిటిసి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పోరెడ్డి విజయలక్ష్మి, మణుగూరు ఎస్టీ సెల్ అధ్యక్షులు కిషన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండబాబు లక్ష్మయ్య రవి శేఖర్ కృష్ణవంశీ, బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గడపగడపకు బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్  చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ఆయన అన్నారు.  బిఆర్ఎస్ ప్రజల సంక్షేమ ప్రభుత్వం అన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ ద్యేయంగా పనిచేస్తున్నదని అన్నారు.    30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని), పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *