అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలి -బిఆర్ఎస్ నియోజక వర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ బాబు
అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలి
-బిఆర్ఎస్ నియోజక వర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ బాబు
మణుగూరు, శోధన న్యూస్ : అభివృద్ధి కొనసాగాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను, పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి రేగా కాంతారావును గెలిపించాలని బిఆర్ఎస్ నియోజక వర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధరాజు నవీన్ బాబు ప్రజలను కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో నవీన్ బాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వారు ఇంటింటి తిరుగుతూ.. ప్రభుత్వ పథకాలను, మేనిఫెస్టోను వివరిస్తూ… ప్రజలను ఓట్లు అభ్యర్ధించారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ బీమా, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం, పెన్షన్ పెంపు, ఉచిత ఇన్సూరెన్స్, రూ.400 కే గ్యాస్ సిలిండర్ వంటి అనేక ప థకాలతో ప్రజలకు మరింత చేకూరనుందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయాకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.