బిఆర్ఎస్ మ్యానిఫెస్టో తోనే సామాన్యులకు మేలు-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
బిఆర్ఎస్ మ్యానిఫెస్టో తోనే సామాన్యులకు మేలు
-ప్రజల పక్షపాతి సీఎం కేసీఆర్
-తన జీవితం ప్రజాసేవకే అంకితం
-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
-బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
మణుగూరు, శోధన న్యూస్ : బిఆర్ఎస్ మ్యానిఫెస్టో తోనే సామాన్యులకు మేలు జరుగుతుందని, ప్రజల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ప్రబుత్వ విప్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మేల్యే రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని బొంబాయి కాలనీ ఏరియా నుంచి మహేష్, సీతారామరాజు, వంశీ, శ్రీధర్, నాగరాజు, వినోద్, విజయ్ లు, పలు కుటుంబాలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరారు. ఈసందర్భంగా వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు జోరు తగ్గదు.. స్పీడు ఆగదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అమలుపరిచిన సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలు నిరుపేదలకు చేరువయ్యాయన్నారు. అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో విజయాన్ని అందించాలని కోరారు. తన జీవితం ప్రజాసేవకే అంకితం అని ఆయన అన్నారు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.