మెజార్టీ తో భట్టి విక్రమార్కను గెలిపించాలి
మెజార్టీ తో భట్టి విక్రమార్కను గెలిపించాలి
ఎర్రుపాలెం, శోధన న్యూస్ : ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మండల పరిధిలోని గుంటుపల్లి గోపవరం, భీమవరం లో అమ్మ ఫౌండేషన్ చైర్మన్ బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని.. విక్రమార్క ను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో మల్లు నందిని కి గ్రామస్తులు స్వాగతం పలికారు. మధిర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బట్టి విక్రమార్క గెలుపు కోసం ప్రతి ఒక్కరము పనిచేయాలని బట్టి విక్రమార్క ద్వారా నే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి వస్తుందని..? కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు గురించి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఆదరణ పెరిగిందని అన్నారు. సంక్షేమ పథకాలు తో ప్రతి కుటుంబానికి ఫలాలు అందుతాయని అన్నారు. భట్టి విక్రమార్క కు ప్రజల జై కొడుతున్నారని హస్తం గుర్తుకి ఓటు వేసి అత్యధిక ఓట్లు మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండారు నరసింహారావు , పీసీసీ సభ్యులు శీలం ప్రతాపరెడ్డి ,శీలం శ్రీనివాసరెడ్డి, అ ను మో లు వెంకటకృష్ణారావు, సామినేని హనుమంతరావు, భీమవరం సర్పంచి వజ్రమ్మ , కోటా కృష్ణ , మీడియా ఇన్ఛార్జి మల్లెల లక్ష్మణరావు , కడియం శ్రీనివాసరావు , వెంకట నరసయ్య, గంటా తిరుపతమ్మ , షేక్ ఇస్మాయిల్ , బాబురావు, శ్రీను, రాజీవ్ గాంధీ ,తది తరులు పాల్గొన్నారు.