సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థి పిట్టల అర్జున్ ను గెలిపించండి
సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థి పిట్టల అర్జున్ ను గెలిపించండి
ములకలపల్లి, శోధన న్యూస్: అవకాశవాద బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను ఓడించాలని, అనునిత్యం ప్రజా సమస్యల కోసం ప్రశ్నించే గొంతు పిట్టల అర్జున్ ను అసెంబ్లీ కి పంపించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలోని తిమ్మంపేట, పోగళ్ళపల్లి, చౌటిగూడెం, ములకలపల్లి,మాదారం, పాత గంగారం, మూకమామిడి, గ్రామ పంచాయతీల ప్రజలు ఘనంగా పూలమాల వేసి స్వాగతించారు. అర్జున్ వెంట పాల్గొన్న అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ..గత ఐదు సంవత్సరాల కాలంలో శాసనసభలో వామపక్షాల లేని లోటు కనబడుతోందని నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు పిట్టల అర్జున్ ని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు ఆవకాశం కల్పించాలని అన్నారు. నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలలో సిపిఎం పార్టీ కార్యకర్తలపై ప్రజలపై ప్రభుత్వం కేసులు పెట్టించి జైలుకు పంపించిందని అనేక పోరాటాల ఉద్యమాల ద్వారానే పోడు భూములకు పట్టాలు వచ్చాయని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మోసం పూరితమైన హామీలను నమ్మకండి మీజీవితల్లో వెలుగులు నిండాలి అంటే మన పిల్లల భవిష్యత్తు మారలి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి సీపీఎం అభ్యర్థి పిట్టల అర్జున్ ను అసెంబ్లీకి పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి పిట్టల అర్జున్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఎం జ్యోతి, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, గౌరీ నాగేశ్వరరావు, వూకంటి రవికుమార్, నిమ్మల మధు,పోడియం వెంకటేశ్వర్లు, ముదిగొండ రాంబాబు, మాలోతు రావుజ, తదితరులు పాల్గొన్నారు.