అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
– ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు
ముదిగొండ, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే,ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన సిఎం సీఎం కేసీఆర్ దే అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు అన్నారు. మండల పరిధిలోని ఎన్నికల్లో భాగంగా కమలాపురం,మల్లారం,వల్లభి, గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది అంటే మన సీఎం కేసీఆర్ అవలంబించిన ప్రతి ఒక్క కుటుంబానికి అందించడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే మధిర నియోజకవర్గ నీ మధుర నగరంగా తీర్చిదిద్దుతానని సూచించారు. ఈ ఒక్కసారి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్న ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పిటిసి పసుపులేటి దుర్గ, పొట్ల కృష్ణకుమారి రైతు కన్వీనర్ పొట్ల వెంకటప్రసాదరావు ,బత్తుల వీరారెడ్డి, లింగస్వామి, వెంకట్ నారాయణ రెడ్డి, పసుపులేటి వెంకట్, ఏలూరి రమేష్, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.