ప్రియాంక గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయండి
ప్రియాంక గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయండి
మధిర, శోధన న్యూస్ : ఈనెల 25న శనివారం మధిర పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని పిలుపునిచ్చారు. శుక్రవారం భట్టి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. భట్టి విక్రమార్కను ఆశీర్వదించడానికి ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారిగా మధిరకు వస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇందిరమ్మ మనవరాలు, రాజీవ్, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ బహిరంగ సభకు వేలాదిగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, వైఎస్ఆర్ టీపీ, జనసమితి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పివిఆర్ కళ్యాణమండపం ఎదురుగా శనివారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ సభ వేదికను ఆమె పరిశీలించారు. ఈ విలేకరుల సమావేశంలో వివిధ పార్టీల నాయకులు సూరంశెట్టి కిషోర్, రంగా హనుమంతరావు,మెండెం లలిత, మల్లాది హనుమంతరావు, కోనా ధని కుమార్, పారుపల్లి విజయ్ కుమార్, బెజవాడ రవిబాబు, అద్దంకి రవికుమార్, దుంపా వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.