కిష్టారం ప్రాథమిక పాఠశాలలో ఓటు పై అవగాహన సదస్సు
కిష్టారం ప్రాథమిక పాఠశాలలో ఓటు పై అవగాహన సదస్సు
సత్తుపల్లి, శోధన న్యూస్ : సత్తుపల్లిమండలం కిష్టారం గ్రామం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కొండా ప్రభుదాసు ఆధ్వర్యంలో 30వ తేదీ జరగబోయే ఎన్నికలకు పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులకు ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ` ఐ ఓట్ ఫర్ షూర్` అనే నినాదంతో స్కూల్ విద్యార్థులతో ఓట్ అనే ఆకారంతో చేర్చి స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు ఓటు ప్రాముఖ్యత తెలిపే విధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఓటు హక్కును విధిగా వినియోగించుకుని రాష్ట్రానికి మరియు దేశానికి సరైన నాయకులను ఎన్నుకునే విధంగా తమ వంతు బాధ్యత నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.