ఆళ్లపల్లి లో న్యూడెమోక్రసీ విస్తృత ప్రచారం
ఆళ్లపల్లి లో న్యూడెమోక్రసీ విస్తృత ప్రచారం
ఆళ్లపల్లి, శోధన న్యూస్ : న్యూ డెమోక్రసీ పార్టీ పినపాక అసెంబ్లీ అభ్యర్థి ఈసం కృష్ణన్న కత్తెర గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని, ఆళ్లపల్లి మండల పరిధిలోని గ్రామ గ్రామాన విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం మండలంలోని జిన్నెలగూడెం, అనంతోగు, ఆళ్లపల్లి, మైలారం, లక్ష్మీపురం, తునికిబండల, ఇప్పనపల్లి, వలసల్ల, రాయిలంక, రామంజిగూడెం, మర్కోడు, బోడాయికుంట, సుద్దరేవు, సందిబంధం, జాకారం, నడిమిగూడెం, పెద్దూరు, జిన్నెలగూడెం, కాచనపల్లి తదితర గ్రామాలలో జీబు జాత నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మర్కోడు అంబేద్కర్ కాలనీలో సమావేశాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆళ్లపల్లి సబ్ డివిజన్ నాయకులు ఎనగంటి చిరంజీవి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు కొమరం సత్యనారాయణ మాట్లాడుతూ… ఈ పాలక ప్రభుత్వాలు రాష్ట్రంలో, కేంద్రంలో అవలంబిస్తున్న తీరును, ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. పాలక ప్రభుత్వాలు చేస్తున్న మోసపూరిత వ్యవహారాలను, ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. అందులో భాగంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పోడు భూములను సాధించి పెట్టిందని, ఫారెస్టు వాళ్లకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిన విషయాలను, పోరాటాలను ఉద్యమాలను ప్రజలకు స్పష్టంగా తెలుసునని, పినపాక నియోజకవర్గం అభ్యర్థి ఈసం కృష్ణన్న కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆళ్లపల్లి సబ్ డివిజన్ నాయకులు యనగంటి రమేష్, బొమ్మెర వీరన్న, బుచ్చి రాజ్యం, గోగ్గల పాపారావు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.